
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
ఐదుగురికి గాయాలు
షాద్‌నగర్‌రూరల్: ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పట్టణంలోని పరిగి రోడ్డులో పోచమ్మ దేవాలయం వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌కు వెళ్లేందుకు షాద్‌నగర్ డిపో నుంచి బయలుదేరింది. పరిగి రోడ్డులో పోచమ్మ దేవాలయం వద్ద బస్సును డ్రైవర్ యూటర్న్ తీసుకుంటుండగా షాద్‌నగర్ వైపు వస్తున్న లారీ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అనంతరెడ్డికి కాలు విరగగా ప్రయాణికులు సుబ్రమణ్యస్వామి, కమ్మరి బాలమణి, జంపుల బాలమణి, అవుసుల సత్యమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డీఎం ఉష, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బస్సు కండక్టర్ శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్‌ఐ అనంతరాములు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment