సర్కారు బడిలో స్వర్ణోత్సవాలు
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో 1955లో జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ప్రారంభించారు. నేటికి ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 1955 నుంచి 2005 వరకు అంటే 50 ఏళ్లు కలిసి చదువుకున్న వారందరూ అపూర్వ కలయిక నిర్వహించాలని నిర్ణంచారు. అనుకున్నదే తడవుగా ఆరు నెలలుగా తీవ్ర కసరత్తు చేశారు. ఆదివారం వేడుకకు ముహూర్తం ఖరారు చేశారు.
అందరిలో ఆతృత
కొంత మంది పూర్వ విద్యార్థులు స్వర్ణోత్సవం నిర్వహించేందుకు కంకణం కట్టుకున్నారు. బాధ్యతగా పాఠశాలలో విద్యనభ్యసించిన వారందరి వివరాలను సేకరించారు. సాంకేతిక సహాయం వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, అందరికీ సమాచారం చేరవేశారు. 50 ఏళ్లలో చదివిన వారందరూ ఆహ్వానితులని పేర్కొంటూ కరపత్రాలను పంపిణీ చేశారు. సమ్మేళనంలో 1955 నుంచి 1980 వరకు పనిచేసిన పూర్వ ఉపాధ్యాయులు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఇంత పెద్ద కలయిక కార్యక్రమం ఎలా నిర్వహిస్తారోనని పూర్వ విద్యార్థులతో పాటు.. ప్రాంత ప్రజలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆత్మీయ కలయిక, ఉపాధ్యాయులకు సన్మానం, ఏడు దశాబ్దాల గుర్తుగా నిర్వహించే వేడుక తీపి జ్ఞాపకంలా మిగిలిపోవాలని భావిస్తున్నారు.
చేవెళ్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవాలకు సిద్ధమవుతోంది. గత యాభై ఏళ్లుగా ఇక్కడ కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులంతా ఒకచోట చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీనికి ఆదివారం మహూర్తం ఖరారు చేశారు. ఈ స్కూల్‌లో అక్షరాలు దిద్ది ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్న ఎంతో మంది తమ చిన్ననాటి మిత్రులతో కలిసి సందడి చేయనున్నారు.
సంబరాలకు సిద్ధమైన చేవెళ్ల జెడ్పీహెచ్‌ఎస్
70 వసంతాల పాఠశాలలో.. 50 ఏళ్ల వేడుక
రేపు కలుసుకోనున్న బాల్యమిత్రులు
ఆరు నెలల శ్రమ
చదువుకున్న పాఠశాలను మరిచిపోవద్దనే ఆలోచనతో 1981– 82 విద్యాసంవత్సరానికి చెందిన బాల్య మిత్రులం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒక బ్యాచ్ వారే ఎందుకు కలవాలి? ఇక్కడ విద్యనభ్యసించిన వారందరూ ఏకమైతే ఎలా ఉంటుందోనన్న ఆలోచణ వచ్చింది. దీంతో ఆరు నెలలుగా జెడ్పీహెచ్‌ఎస్ వేదికగా సమీక్ష నిర్వహించాం. కార్యాచరణ రూపొందించాం. స్వర్ణోత్సవాలకు శ్రీకారం చుట్టాం.
– రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా, పూర్వ విద్యార్థి
సర్కారు బడిలో స్వర్ణోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment