సుభాష్ నగర్: కరెంటు తీగను కట్ చేస్తుంగా విద్యుదాఘాతానికి గురై ఓ బాలుడు మృతి చెందిన సంఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కై సర్ నగర్ చెందిన మహమ్మద్ అలీమ్ ఖాన్ కుమారుడు ఎజాజ్ హలీమ్ ఖాన్ (13) కరెంట్ పని చేసేవాడు. సోమవారం సాయంత్రం అత ను నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో కరెంట్ తీగను కట్ చేస్తుండగా సమీపంలో ఉన్న విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment