జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
షాద్‌నగర్: జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని దేవీ గ్రాండ్ హోటల్‌లో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు మిద్దెల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ అదే బాటలో నడుస్తోందని ధ్వజమెత్తారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనందం, బండి విజయ్‌కుమార్, కార్యదర్శి జగదీశ్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు దేవేందర్, జిల్లా కార్యదర్శి సైదులు, జిల్లా కమిటీ సభ్యులు మల్లేశ్, నరేష్, నరసింహారెడ్డి, ఆంజనేయులు, భరత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
Comments
Please login to add a commentAdd a comment