
ప్రజల గుండెల్లో కేసీఆర్
మీర్‌పేట: ఫ్లెక్సీలు చించినంత మాత్రాన ప్రజల గుండెల్లో నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తొలగించలేరని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా రెడ్డి అన్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా సోమవారం మీర్‌పేట మంత్రాల చెరువు వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 14 ఏళ్లు అన్ని వర్గాలు, సంఘాలను ఒక్క తాటిపైకి తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. పదేళ్లు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుంచిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అంతకు ముందు బీఆర్‌ఎస్ నాయకులు లలితానగర్ చౌరస్తాలో కేక్ క్‌ట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు అర్కల భూపాల్‌రెడ్డి, రామిడి రాంరెడ్డి, అనిల్‌యాదవ్, అర్కల కామేశ్‌రెడ్డి, జటావత్ శ్రీనునాయక్, రజాక్, దిండు భూపేష్‌గౌడ్, సిద్ధాల లావణ్య, దోమలపల్లి ధనలక్ష్మి పాల్గొన్నారు.
మహనీయుల విగ్రహావిష్కరణ
మీర్‌పేట కార్పొరేషన్ 39వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మాదరి సురేఖ రమేష్ ఆధ్వర్యంలో జిల్లెలగూడ కమలానగర్‌లో ఏర్పాటు చేసిన అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌రాం, మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాలను ఆదివారం రాత్రి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు గజ్జెల రాంచందర్, మాదరి శ్రీనివాస్, లప్ప లక్ష్మణ్, బాలకృష్ణ, ఎన్.శ్రీనివాస్, బొజ్జ భాస్కర్, జి.శైలేందర్, గౌతం, ఎన్.హరికాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సబితా రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment