నాగోలు: తనపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాసే వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మాజీ పీఏ దేవిరెడ్డి సతీష్‌రెడ్డి మంగళవారం ఎల్‌బీనగర్ డీసీపీ ప్రవీణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై సోషల్ మీడియా వస్తున్న వార్తలను ఖండిస్తున్నాని నేను ఎక్కడికి వెళ్లలేదని హైదరాబాదులోనే ఉన్నానన్నారు. రాజకీయాలలోనే ఉన్నత విలువలు కలిగిన నాయకుడిగా పేరున్న రాజగోపాల్ రెడ్డి దగ్గర గత 16 ఏళ్లుగా పనిచేస్తున్న నేను రాజగోపాల్ రెడ్డి కానీ.. నా కుటుంబానికి కానీ మచ్చ తెచ్చే పని చెయ్యలేదన్నార. కొన్ని సోషల్ మీడియా వేదికలు బాధ్యతారాహిత్యంగా ప్రచారం చేసిన వార్తలతో నేను నా కుటుంబ సభ్యులు మనోవేదనకు గురవుతున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment