
చూపు
ఆదివారం శ్రీ 23 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
మందగించిన
చిన్నారుల్లో పెరుగుతున్న దృష్టి లోపం
8లోu
సాక్షి, రంగారెడ్డిజిల్లా/షాద్‌నగర్: విటమిన్ ‘ఎ’ లోపం.. గంటల తరబడి స్మార్ట్‌ఫోన్లు, టీవీ తెరలకు అతుక్కుపోవడం.. చీకటి గదుల్లో కూర్చొని చదవడం.. వెరసి చిన్న తనంలోనే కంటి చూపు మందగిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు విటమిన్ లోపంతో బాధపడుతుండగా.. ప్రైవేటు స్కూళ్లలో విద్యనభ్యసిస్తున్న పిల్లలు స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, కంప్యూటర్ స్క్రీన్లకు అతుక్కుపోయి కంటిచూపును దెబ్బతీసుకుంటున్నారు. సాధారణంగా ఆరు పదుల వయసులో రావాల్సిన కళ్లజోళ్లు జీవనశైలి మార్పుతో ప్రస్తుతం పదేళ్ల వయసులోనే తప్పనిసరి అయ్యాయి. దృష్టి లోపంతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
అక్షరాలు చదవలేక అవస్థలు
పిల్లల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే) సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో 5 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న వారికి కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. వైద్య నిపుణుల బృందాలు పాఠశాలల్లో ఇప్పటి వరకు 88,348 మందికి స్క్రీనింగ్ చేశాయి. మూడు విడతల్లో చేసిన వైద్య పరీక్షల్లో 7,409 మంది పిల్లలు కంటిచూపు సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. కొంతమంది దూరపు చూపు సమస్యతో బాధపడుతుండగా, మరికొందరు దగ్గరి చూపు సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు నిర్ధారించారు. మెజార్టీ పిల్లలు కనీసం అక్షరాలు చదవలేకపోతున్నట్లు తేల్చారు.
న్యూస్‌రీల్
ఏరియా ఆస్పత్రులకు తరలించి
మసక చూపుతో బాధపడుతున్న చేవెళ్ల డివిజన్ పరిధిలోని పిల్లలను కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం మండలాల్లోని పిల్లలను వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఆమనగల్లు, మహేశ్వరం, షాద్‌నగర్ పిల్లలను షాద్‌నగర్ ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయిస్తున్నారు. ఒక్కో ఏరియా ఆస్పత్రిలో రోజుకు వంద నుంచి 150 మంది విద్యార్థులకు మూడో విడత చెకప్ చేస్తున్నారు. వీరిలో కంటి అద్దాలు అవసరమైన వారికి నిర్ధారించిన సైట్ పర్సంటేజీ, ఫ్రేమ్‌లు, అద్దాలకు ఆర్డర్లు కూడా ఇస్తున్నారు. వార్షిక పరీక్షల ప్రారంభానికి ముందే వీరికి అద్దాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 2,744 మంది విద్యార్థులకు సంబంధించి ఆర్డర్ ఇచ్చినట్లు ఆర్‌బీఎస్‌కే విభాగం ప్రకటించింది.
సర్కారు బడుల్లో ప్రత్యేక స్క్రీనింగ్ క్యాంపులు
జిల్లాలో 88,348 మంది విద్యార్థులకు నేత్ర పరీక్షలు
7,409 మందికి కంటిచూపు సమస్యలు ఉన్నట్లు గుర్తింపు
విటమిన్ ‘ఎ’ లోపం, స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోవడమే కారణం

చూపు
Comments
Please login to add a commentAdd a comment