
ఐకమత్యంతోనే అభివృద్ధి
మొయినాబాద్‌రూరల్: యాదవులు పాడి పరిశ్రమ, పాల ఉత్పత్తి, గొర్రెలు, మేకలతో ఆర్థికాభివృద్ధి చెందాలని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీందర్‌యాదవ్ అన్నారు. హిమాయత్‌నగర్ చౌరస్తా లోని కంజర్ల మాల్‌లో శనివారం జిల్లా యువజన అధ్యక్షుడు పేరమోని లక్ష్మీపతియాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు రాయనల్ల రవీందర్‌యా దవ్ ఆధ్వర్యంలో పాడిపరిశ్రమపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చింతల రవీందర్‌యాదవ్‌తో పాటు తెలంగాణ యానిమల్ హజ్బెండరీ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ కాస లలితయాదవ్ హాజరయ్యారు. చింతల రవీందర్‌యాదవ్ మాట్లాడుతూ.. ఐకమత్యంగా ఉన్నప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతామని అన్నారు. యాదవ కులస్తులంతా ఆర్థికాభివృద్ధి చెందేందుకు అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం పాడి పరిశ్రమ, పాల ఉత్పత్తిపై అవగాహన కల్పించారు. గొర్రెలు, మేకల వ్యాపారులకు సంతానోత్పత్తి, వర్షాకాలంలో గొర్రెలు, మేకలు, గేదెలకు సోకే వ్యాధులు, నివారణ గురించి వివరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేకల రాజేందర్‌యాదవ్, రాష్ట్ర యువజన అధ్యక్షుడు గోర్ల యశ్వంత్‌రాజ్‌యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు బద్ధుల సుధాకర్‌యాదవ్, మండల అధ్యక్షుడు బైకని చెన్నయ్యయాదవ్ పాల్గొన్నారు.
ఈక్వెస్ట్రియన్ జాతీయ
అర్హత పోటీలు షురూ
శంకర్‌పల్లి: మండల పరిధిలోని జన్వాడలో ని నాసర్ పోలో హార్స్ రైడింగ్ క్లబ్‌లో శనివారం ప్రారంభమైన ఈక్వెస్ట్రియన్ జాతీయ అర్హత పోటీలు ఆద్యంతం ఉత్సాహంగా సాగాయి. దేశంలోని గుర్తింపు పొందిన హార్స్ రైడింగ్ క్లబ్‌ల నుంచి క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అండర్–11, అండర్–14, అండర్–18 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసింది. శనివారం అండర్–11, అండర్– 14 విభా గాల్లో షో జంపింగ్ పోటీలు నిర్వహించారు. పోటీలకు కల్నల్ దుశ్యంత్ బాలి, కల్నల్ ఎస్.ఎల్ రెడ్డి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. పోటీల్లో హైదరాబాద్‌కి చెందిన ఐజా మీర్ అద్భుత ప్రతిభ కనబరిచి ఢిల్లీలో జరిగే జాతీయ జూనియర్ ఈక్వెస్ట్రియన్ ఛాంపియన్ షిప్‌నకు ఎంపికైంది. నాసర్ పోలో హార్స్ రైడింగ్ క్లబ్ సీఈఓ మీర్ హాఫీజుద్దీన్ అహ్మద్ మాట్లాడుతూ.. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్టు చెప్పారు.
జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి
షాద్‌నగర్‌రూరల్: పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని జీపీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు టంగుటూరి నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులు, సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని కోరుతూ శనివారం జీపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సుజనకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికులకు నాలుగు నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పెండింగ్ వేతనాలు ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పంచాయతీల్లో పనిచేస్తూ చనిపోయిన కార్మికుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగావకాశం కల్పించాలని, జీపీల్లో పని చేస్తున్న కార్మికులందరి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రతి పంచాయతీల్లో కారోబార్, బిల్‌కలెక్టర్, పంచాయతీ సహాయ కార్యదర్శులను నియమించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి కార్మికుడికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో జీపీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎండీ యూసుఫ్, ప్రధాన కార్యదర్శి వెంకటరాజం, ఉపప్రధాన కార్యదర్శి మల్లయ్య, కోశాధికారి ఆంజనేయులు తదితరులు ఉన్నారు.

ఐకమత్యంతోనే అభివృద్ధి
Comments
Please login to add a commentAdd a comment