
లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి
చేవెళ్ల: పెండింగ్ కేసుల పరిష్కారం కోసం కొనసాగుతున్న ప్రత్యేక లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రిటైర్డ్ జడ్జి సాంబశివరావు సూచించారు. మండల కేంద్రంలోని కోర్టు ఆవరణలో మంగళవారం ట్రాఫిక్ పోలీసులు కేసులపై ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ జడ్జి సాంబశివరావు పలు కేసులను పరిష్కరించి వాటికి జరిమానాలు విధించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 3వ తేదీ నుంచి 8 వరకు ప్రత్యేక లోక్ అదాలత్ కొనసాగుతుందన్నారు. చేవెళ్ల ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన ట్రాఫిక్ కేసులలో మద్యం తాగి వాహనాలు నడపడం, లైసెన్స్‌లు లేకుండా నడపడం తదితర వాటిని పరిష్కరించుకోవచ్చని తెలిపారు. చేవెళ్ల ట్రాఫిక్ సీఐ వెంకటేశం మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లో మద్యం తాగి వాహనాలు నడిపించిన 71 కేసులు పరిష్కరించి రూ.1,86,500 జరిమానాలు విధించినట్లు చెప్పారు. డ్రైవింగ్‌లైసెన్స్‌లు లేకుండా నమోదైన 63 కేసులను పరిష్కరించి రూ.83,500 జరిమానాల రూపంలో వచ్చాయన్నారు. శనివారం వరకు ఈ లోక్‌అదాలత్ కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ట్రాఫిక్ పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రిటైర్డ్ జడ్జి సాంబశివరావు
Comments
Please login to add a commentAdd a comment