క్రీడలతో శారీరక దారుఢ్యం
మొయినాబాద్‌రూరల్: క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు స్నేహ బంధాలు పెంపొందుతాయని ఇండియన్ కబడ్డీ ప్లేయర్ గంగాధరి మల్లేశ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని జేబీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యాసంస్థల కార్యదర్శి కృష్ణారావు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణామాచారి, డైరెక్టర్ సంజయ్, డీన్ క్రటిజ్ఞాన్, స్టూడెంట్ ఎంపైర్స్ డాక్టర్ సలావుద్దీన్, ఫిజికల్ డైరెక్టర్ విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇండియన్ కబడ్డీ ప్లేయర్ మల్లేశ్
Comments
Please login to add a commentAdd a comment