
మహిళల్ని ఎదగనిద్దాం.. గౌరవిద్దాం
ఖైరతాబాద్: మహిళల్ని ఎదగనిద్దాం.. గౌరవిద్దాం.. ఆత్మగౌరవంతో తలెత్తుకుని తిరగనిద్దామని మంత్రి సీతక్క అన్నారు. శనివారం ఉదయం నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా వేదికగా ఉమెన్ సేఫ్టీ వింగ్, హైదరాబాద్ సిటీ పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే రన్‌ను ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ‘మహిళలు ఫిజికల్ ఫిట్‌నెస్‌తో పాటు మానసిక స్థైర్యాన్ని పెంచుకోవాన్నారు. మహిళల రక్షణకు పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. మత్తు నుంచి మన సమాజాన్ని కాపాడుకుని, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకునేలా ముందడుగు వేయాలని సూచించారు. అనంతరం పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమైన 5కే రన్ సచివాలయం మీదుగా తిరిగి పీపుల్స్ ప్లాజా వరకు సాగింది. రన్‌లో పోలీసు ఉన్నతాధికారులు, హైదరాబాద్ సిటీ సెక్యురిటీ సర్వీసెస్, ఉమెన్‌సేఫ్టీ వింగ్ అధికారులు, మహిళలు, యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మంత్రి సీతక్క
ఉత్సాహంగా 5కే రన్
Comments
Please login to add a commentAdd a comment