తాళం వేసిన ఇళ్లే టార్గెట్
షాద్‌నగర్ రూరల్: పట్టణ శివారు కాలనీల్లో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో సోమవారం పట్టణంలోని తిరుమల మెగా టౌన్‌షిప్ కాలనీలో రెండు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన ప్రకారం.. తిరుమల మెగాటౌన్‌షిప్ కాలనీలో నివాసముండే రాజేష్, ఝాన్సీ దంపతులు ప్రభుత్వ ఉపాధ్యాయులు, కనకయ్య దంపతులు ప్రైవేటు ఉద్యోగస్తులు. ఉదయం వారు ఇళ్లకు తాళం వేసి తమతమ విధులకు వెళ్లిపోయారు. గమనించిన దుండగులు రాజేశ్ ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని వస్తువులు చిందరవందర చేశాడు. ఏమీ దొరక్కపోవడంతో పక్కనే ఉన్న కనకయ్య ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నింగా శబ్ధంరావడంతో చుట్టుపక్కల ఇళ్లవారు అక్కడకు వెళ్లే వరకే దుండగుడు పరారయ్యాడు. విధుల నుంచి వచ్చిన రాజేశ్ దంపతులు తాళం పగులగొట్టి ఉండడంతో డయల్ 100 నంబర్‌కు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరకుని సీసీ పుటేజీలు పరిశీలించారు. రాజేశ్, కనకయ్య ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడు ఒకడే అని గుర్తించారు. కేసు దర్యాప్తులో ఉంది.
రెండు ఇళ్లలో చోరీకి విఫలయత్నం
Comments
Please login to add a commentAdd a comment