
ఆగని పొగలు.. తీరని వెతలు
సోమవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2025
శంకర్‌పల్లి: ఐదు గ్రామాల కలయికతో 2018లో మున్సిపాలిటీ ఆవిర్భవించింది. ఇక్కడ డంపింగ్ యార్డు సమస్య తీవ్రంగా ఉంది. స్థలం కోసం అన్వేషిస్తున్నప్పటికీ దొరకడం లేదు. గతంలో రెవెన్యూ అధికారులు సింగాపురం సమీపంలో అసైన్డ్ భూమిని కేటాయించగా.. అక్కడి స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో అడుగు ముందుకు పడడం లేదు. ప్రస్తుతం ఉన్న డంపింగ్ యార్డు మున్సిపాలిటీ అవసరాలను తగినంత లేకపోగా.. దానిపై నుంచి 400 కేవీ విద్యుత్ హైటెన్షన్ వైర్లు ఉన్నాయి. ఆకతాయిలు, చెత్త సేకరించే వారు నిప్పు వేయడంతో పెద్ద ఎత్తున మంటలు, పొగలు వ్యాపిస్తున్నాయి. కిలో మీటర్ల మెర పొగలు వ్యాపిస్తుండడంతో సమీపంలోని ఆదర్శనగర్, సింగాపూర్, బొప్పన్న వెంచర్‌వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు తడి, పొడి చెత్త సేకరణ ముందుకు సాగడం లేదు.
సమస్యలు పరిష్కరిస్తాం
మున్సిపాలిటీలో 52మందితో నిత్యం ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేయిస్తున్నాం. డంపింగ్ యార్డు సమస్య ఉన్న మాట వాస్తవమే. స్థల సమస్యపై రెవెన్యూ అధికారులతో మాట్లాడి త్వరలోనే కొత్తది నిర్మిస్తాం. ప్రస్తుతం ఉన్న డంపింగ్ యార్డు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. నిప్పు వేసే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం. – యోగేశ్, మున్సిపల్ కమిషనర్, శంకర్‌పల్లి
న్యూస్‌రీల్