
ముసుగు దొంగల హల్‌చల్ తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దుండగు
● జనాభాకు తగ్గట్టు లేని సరఫరా
బుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2025
8లోu
ఇబ్రహీంపట్నం: జనాభా అవసరాలకు తగ్గట్టు మిషన్ భగీరథ మంచినీళ్లు సరఫరా కావడం లేదు. మున్సిపాలిటీ పరిధిలో 45 నుంచి 50 వేల జనాభా నివసిస్తున్నారు. 7,500 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. నిత్యం 50 లక్షల లీటర్ల తాగునీరు అవసరం ఉండగా 39 లక్షల నుంచి 41 లక్షల లీటర్ల లోపే సరఫరా అవుతోంది. మరో పది లక్షల లీటర్ల కోసం ఇతరత్రా మార్గలపై ఆధారపడాల్సి వస్తోంది. వేసవి వచ్చిందంటే చాలు నీటి ఎద్దడి షరా మామూలే అవుతోంది. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టినట్టు మున్సిపల్ యంత్రాంగం చెబుతోంది. మున్సిపల్ పరిధిలోని 102 బోర్లకు మరమ్మతులు, ప్లషింగ్ చేయించామని, సుమారు 5 లక్షల లీటర్ల నీటిని ఈ బోర్ల ద్వారా ప్రజలు ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. 5,500 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకర్ ద్వారా రోజుకు నాలుగైదు ట్రిప్పులు ఆయా బస్తీల్లో సరాఫరా చేస్తున్నట్టు పేర్కొన్నారు. నీటి ఎద్దడి తీవ్రమైతే మరో రెండు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లతోపాటు కొత్తగా రెండు బోర్లను వేసేందుకు ఉన్నతాధికారులతో అనుమతులు పొందినట్టు చెప్పారు.
ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లకు గిరాకీ
ఎండలు ముదురుతుండటంతో తాగునీటి సమస్య ఉత్పన్నం అవుతోంది. కొత్తగా వెల సిన కాలనీల్లో పంపిణీ సక్రమంగా లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. రూ.500 చొప్పున ట్యాంకర్ నీటిని పంపిణీ చేస్తున్నారు.
న్యూస్‌రీల్
చర్యలు తీసుకుంటున్నాం
వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు మిషన్ భగీరథ నీరు పంపిణీ కావడం లేదు. ఇక్కడున్న నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. కొత్త బోర్లు వేసేందుకు, ప్రైవేట్ వాటర్ ట్యాంకులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. – రవీంద్రసాగర్, మున్సిపల్ కమిషనర్

ముసుగు దొంగల హల్‌చల్ తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దుండగు

ముసుగు దొంగల హల్‌చల్ తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దుండగు