ఆమనగల్లు: మున్సిపాలిటీ జనాభాకు అనుగుణంగా నీటి సరఫరా లేకపోవడంతో కొన్ని కాలనీల్లో నీటికోసం ఇబ్బందులు తప్పడం లేదు. పలు కాలనీలకు బోర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. నీటి సరఫరా లేని కాలనీలకు ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నారు. జనాభాకు అనుగుణంగా ట్యాంక్‌ల నిర్మాణం చేపట్టలేదు. ప్రతిరోజు 25 లక్షల లీటర్ల నీరు అవసరం ఉండగా మిషన్ భగీరథ ద్వారా 19 లక్షల లీటర్ల సరఫరా జరుగుతోంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని కాలనీలకు బోర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. పట్టణంలోని బీసీ కాలనీ, విద్యానగర్ కాలనీలకు బోర్ల ద్వారానే సరఫరా చేస్తున్నారు. కొన్ని కాలనీలకు ట్యాంకర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఎండలు తీవ్రమైతే ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్త చేస్తున్నారు.
ఇబ్బంది లేకుండా చూస్తాం
మిషన్ భగీరథ నీరు అందని కాలనీలకు బోర్ల ద్వారా అందిస్తున్నాం. అవసరమైన చోట నూతన పైప్‌లైన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం. వేసవిలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం.
– శంకర్, మున్సిపల్ కమిషనర్
పైప్‌లైన్ నిర్మించాలి
మా కాలనీకి మిషన్ భగీరథ నీరు రావడం లేదు. కాలనీలో ఉన్న బోరు ద్వారా సరఫరా చేస్తున్నారు. నూతనంగా పైప్‌లైన్ నిర్మించి మిషన్ భగీరథ నీరు అందించాలి. కాలనీలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించాలి.
– అనిత, విద్యానగర్ కాలనీ, ఆమనగల్లు
● బోర్లు.. ట్యాంకర్లతో సరఫరా
● బోర్లు.. ట్యాంకర్లతో సరఫరా