షాద్‌నగర్: పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీను నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పీర్లగూడ, చించోడ్, అయ్యవారిపల్లి గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలను వారు పని చేస్తున్న ప్రదేశాల్లో కలిశారు. ఈ సందర్బంగా శ్రీను నాయక్ మాట్లాడుతూ.. ఉపాధి పథకంలో పని చే స్తున్న కూలీలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పి ంచడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆరోపించారు. పని ప్రదేశాల్లో తాగునీరు. టెంట్లు, వైద్య సదుపాయం కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం రోజు వారీ కూలీ రూ.300 నుంచి రూ.800లకు పెంచాలని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమి లేని పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, కొత్త గా దరఖాస్తు చేసుకున్న వారికి జాబ్‌కార్డులను ఇచ్చి పని కల్పించాలని డిమాండ్ చేశారు. కూలీలు ఎదు ర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించా రు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు మల్లేష్, కి ట్టు, చంద్రకాంత్, శ్రీను, యాదయ్య, శంకర్ నా యక్, శివ శంకర్, ఆంజనేయులు, కృష్ణయ్య, రాంచంద్రయ్య, ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘంజిల్లా ఉపాధ్యక్షుడు శ్రీను నాయక్