మహేశ్వరం: మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో విలీనం చేయాలని మహేశ్వరం ఫ్యూచర్ సిటీ జేఏసీ చైర్మన్ వత్తుల రఘుఫతి డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని కర్నాటి మనోహర్ కాంప్లెక్స్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘుపతి మాట్లాడుతూ.. మండల పరిధిలోని తుమ్మలూరు, మెహబ్బత్‌నగర్‌లను మాత్రమే ఫ్యూచర్ సిటీలో విలీనం చేయడం సరికాదన్నారు. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు మహేశ్వరాన్ని మహానగరంగా మార్చుతామని ఉచిత హామీలిచ్చి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలో ఫ్యూచర్‌సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి కేవలం రెండు గ్రామాలను విలీనం చేసి అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఓఆర్‌ఆర్‌కు అతి చేరువలో ఉన్న మహేశ్వరం మండలాన్ని ప్యూచర్ సిటీలో విలీనం చేయకపోవడం సరికాదన్నారు. త్వరలో అన్ని పార్టీలు, ప్రజాసంఘాలను ఐక్యం చేసి ఫ్యూచర్ సిటీలో మండలపరిధిలోని అన్ని గ్రామాలను కలిపేవరకు ఉద్యమిస్తామన్నారు. నియోజకవర్గంలో స్ధానికేతలరులను గెలిపిస్తే తమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే సబితారెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులను కలిసి సీఎం రేవంత్‌రెడ్డికి కలిసి తమ సమస్యలను విన్నవిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్యూచర్ సిటీ జేఏసీ కమిటీ సభ్యులు మనోహర్, కడారి జంగయ్య, కాకి ఈశ్వర్, మల్లేశ్ యాదవ్, అంధ్యా నాయక్, నందిగామ నర్సింహ, ఆవుల యాదయ్య, యాదయ్య గౌడ్, యాదగిరి గౌడ్, దత్తు నాయక్, రవికుమార్, రాజు నాయక్, సుదర్శన్ యాదవ్, యాదీష్, కృష్ణా నాయక్, రమేష్, ఆంజనేయులు, శ్రావణ్ పాల్గొన్నారు.
మహేశ్వరం ఫ్యూచర్ సిటీజేఏసీ చైర్మన్ రఘుఫతి