మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం
చేవెళ్ల: క్రీడలు యువతలో నూతన ఉత్తేజాన్ని నింపుతాయని మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం అన్నారు. పట్టణ కేంద్రంలో నెల రోజులుగా కొనసాగుతున్న పెద్దోళ్ల పర్మయ్య మెమోరియల్ మండల స్థాయి క్రికెట్ టోర్నీ శుక్రవారంతో ముగిసింది. ఈ పోటీల్లో విజేతలకు పర్మన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దయాకర్, కేఎస్ రత్నం నగదు బహుమతులు అందజేశారు. విజేత జట్టు ఊరెళ్లకు రూ.50వేలు, రన్నరప్ జట్టు రామన్నగూడకు రూ.25వేల నగదు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా దయాకర్, కేఎస్ రత్నం మాట్లాడుతూ.. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజీపీ మండల అధ్యక్షుడు అత్తెల్లి అనంత్‌రెడ్డి, యువ నాయకుడు డాక్టర్ మల్గారి వైభవ్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కె. శివప్రసాద్, నాయకులు వెంకట్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ఇంద్రాసేనారెడ్డి, జహంగీర్, నర్సింలు, పి. ప్రభాకర్, యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.