మొయినాబాద్: సురంగల్, కనకమామిడి పొలిమేరలో ఆక్రమణకు గురైన వరద కాల్వను రెవెన్యూ అధికారులు పరిశీలించారు. మొయినాబాద్‌లోని సురంగల్, కనకమామిడి రెవెన్యూల్లో వెంచర్ ఏర్పాటుకు రియల్టర్లు కాల్వను పూడ్చేసి చదును చేయడంపై ‘వరద కాలువ మాయం’అనే శీర్షికతో గురువారం ‘సాక్షి’దినపత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. శుక్రవారం తహసీల్దార్ గౌతమ్‌కుమార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాజేష్, సర్వేయర్ వరద కాలువను పరిశీలించారు. సురంగల్, కనకమామిడి, నజీబ్‌నగర్ రెవెన్యూల పొలిమేర నుంచి వరద కాలువ ఉన్నట్లు విలేజ్ మ్యాప్‌ను పరిశీలించి గుర్తించారు. నీటి వనరులను, వరద కాలువలను పూడ్చివేసినా, ఆక్రమించినా కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ గౌతమ్‌కుమార్ హెచ్చరించారు. ఆక్రమణకు గురైన వరద కాలువను పునరుద్ధరిస్తామన్నారు. వరద కాలువను పూడ్చినవారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు.
వరద కాల్వ పరిశీలన