
చైన్‌స్నాచింగ్‌పై రాచకొండ సీపీ ఆరా
ఇబ్రహీంపట్నం రూరల్: కల్లు తాగేందుకు వచ్చి.. మహిళ మెడలో బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన దుండగులకు సంబంధించి సాక్షి దినపత్రికలో ప్రచురితమైన వార్తకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు స్పందించారు. పోలీసు అధికారులను ఆరా తీశారు. గతంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అడిగి తెలుసుకున్నారు. సీపీ ఆదేశాల మేరకు మంగళవారం మధ్యాహ్నం హుటాహుటిన ఎంపీపటేల్‌గూడకు చెందిన బాధితురాలు తక్కలపల్లి ప్రేమలత వద్దకు వెళ్లారు. జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదు చేయాలని ఆమెను కోరగా ఒప్పుకోలేదు. దీంతో సాయంత్రం తన నివాసానికి వెళ్లిన పోలీసులు ఎంత నచ్చజెప్పినా ఫిర్యాదు చేయనంటే చేయనని తేల్చి చెప్పింది. గతంలో తన బంగారు పుస్తెలతాడు పోతే నేటికి న్యాయం జరగలేదని, ఇప్పుడు కూడా ఫిర్యాదు ఇచ్చినా దండగేనని వాపోయింది. అలా ఏమీ ఉండదని, తప్పకుండా న్యాయం జరుగుతుందని పోలీసులు సూచించినా వినిపించుకోలేదు. దీంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు.
బాధితురాలి నుంచి వివరాల సేకరణ
ఘటనపై ఫిర్యాదు చేయాలని సూచన