విద్యారంగం బలోపేతం కావాలి
ఆమనగల్లు: ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. మాడ్గుల మండలం గిరికొత్తపల్లి గ్రామానికి చెందిన కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడె, నమస్తే ఉపాధ్యాయ పత్రిక సహ సంపాదకుడు కృష్ణారెడ్డి ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌హాలులో ఆదివారం నిర్వహించారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కృష్ణారెడ్డి, రజిత దంపతులను పలువురు ఘనంగా సత్కరించారు. ఉద్యోగ విరమణ పొందుతున్న ఉపాధ్యాయులు సమాజసేవకు అంకితం కావాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్, మాజీ ఎమ్మెల్సీ నర్సింహారెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రవి, ప్రధాన కార్యదర్శి సదానంద్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు పర్వత్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అనురుద్రారెడ్డి, ఎంఈఓ రామారావు, శృతిలయ కల్చరల్ అకాడమీ చైర్మన్ చిత్తరంజన్‌దాస్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సుధాకర్‌రెడ్డి, ప్రేమ్‌కుమార్, రాధా, జయలక్ష్మి, శిరీష, విశ్వశాంతి, యాదవరెడ్డి, వనజాత, ప్రమోదిత, రమణారెడ్డి, సబిత, వికాస్, రజవర్ధన్‌రెడ్డి, సాయికిశోర్ తదితరులు పాల్గొన్నారు.
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి


