
ఎస్టీయూ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నజిల్లా అధ్యక్షుడు సయ్యద్ సాబేర్
కొండాపూర్(సంగారెడ్డి): ఉద్యమ పతాక , ఉపాధ్యాయ గొంతుకగా, నిరంతరం విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది కేవలం ఎస్టీయూ మాత్రమేనని జిల్లా అధ్యక్షుడు సయ్యద్ సాబేర్ అన్నారు. ఎస్టీయూ 76 వసంతాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం సంఘం కార్యాలయంలో పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాటి నిజాం నిరంకుశ వైఖరికి ఎదురొడ్డి, ఉద్యమ తిరుగుబాటు జెండా ఎగురవేసిన కామ్రెడ్ మగ్దుం మొహియుద్దీన్ ఉపాధ్యాయుల హక్కుల కోసం ఏర్పాటుచేసిన సంఘం రాష్ట్రోపాధ్యాయ సంఘమన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోవడంలేదని విమర్శించారు. పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలో విద్యా వలంటీర్లను, పాఠశాల పరిశుభ్రతకు స్కావెంజర్లను నియమించాలని డిమాండ్ చేశారు. అలాగే పదోన్నతులు, బదిలీలు లేకపోవడంతో ఉపాధ్యాయులు ఆవేదనతో ఉన్నారన్నారు. వెంటనే షెడ్యూల్ ప్రకటించి అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి రమేశ్ కుమార్, జిల్లా ఆర్థిక కార్యదర్శి రమణ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రతాపరెడ్డి, సంగారెడ్డి మండల అధ్యక్షులు నరసింహ, ప్రకాశ్, సుందర్‌రావు, సిద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment