
హైదరాబాద్: పటాన్‌చెరు ఎస్‌ఐ దుర్గయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన దివ్య(18) అదే రాష్ట్రానికి చెందిన వికాస్‌కు ఇచ్చి వివాహం చేశారు. బతుకుదెరువు కోసం మండల పరిధిలోని ఇస్నాపూర్‌కు వచ్చి అద్దెకు ఉంటున్నారు. వికాస్ డీమార్ట్‌లో పనిచేస్తున్నాడు. ఈ నెల 25వ తేదీన వికాస్ ఎప్పటిలాగే పనికి వెళ్లగా మధ్యాహ్నం అతని భార్య దివ్య పోన్‌చేసి ఇంటికి రమ్మని చెప్పింది.
దీంతో వికాస్ ఇంటికి వెళ్లేసరికి ఎలుకల మందు తాగానని చెప్పడంతో ఆమెను వెంటనే పటాన్‌చెరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి దివ్య చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి రాధాగజనాన్ తన కూతురు ఆరోగ్య పరిస్థితి సరిగాలేక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment