తూప్రాన్: ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణ కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ యాదగిరి కథనం మేరకు.. మాసాయిపేట మండలం కోప్పులపల్లి గ్రామానికి చెందిన గౌరారం సాయికుమార్(22) చిన్నతనంలో తల్లిదండ్రులు మృతి చెందారు. అప్పటి నుంచి చిన్నాన్న వద్ద పెరిగాడు. తూప్రాన్ పట్టణంలోని ఓ మెడికల్ ఏజెన్సీలో పని చేస్తూ ఎల్లమ్మ దేవాలయం కాలనీలో అద్దె గదిలో మరో స్నేహితుడితో ఉంటున్నాడు.
మంగళవారం ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయం గుర్తించిన స్నేహితుడు మృతుడి చిన్నాన్నతోపాటు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సాయికుమార్ తాను ఒంటరి వాడినని మనస్తాపం చెందేవాడని, ఆ కారణంతోనే జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment