దెబ్బతిన్న పంటల పరిశీలన
జహీరాబాద్: కోహీర్ మండలంలో కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. బుధవారం మండల వ్యవసాయాధికారి నవీన్‌కుమార్ మండల కేంద్రమైన కోహీర్‌తోపాటు మండలంలోని సజ్జాపూర్, ఖానాపూర్, బడంపేట, మాచిరెడ్డిపల్లి, తదితర గ్రామాల్లో సాగులో ఉన్న నేలవాలిన, దెబ్బతిన మొక్కజొన్న, జొన్న పంటల వివరాలను సేకరించారు. పంటలు ఏ మేరకు దెబ్బతిన్నాయనే విషయాన్ని మండలంలోని ఖానాపూర్ గ్రామాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న పంటల వివరాలను నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదికను సమ ర్పించనున్నట్లు ఏఓ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment