పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు తప్పనిసరి
సంగారెడ్డి: చలి కాలంలో పిల్లలు, వృద్ధులు అనేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్య నియమాలు పాటించాలి.జలుబు, దగ్గు ఉన్న వారు గోరువెచ్చని నీటిని తాగడం మంచిది. ఎప్పటికప్పుడు వేడి పదార్థాలను తీసుకోవాలి. చలి కాలంలో శరీరం పొడిబారి దురద, మంట వంటివి కలుగుతుంటాయి. పిల్లల చర్మం పొడి బారకుండా ఉండాలంటే ఆలివ్ ఆయిల్‌తో బాగా మసాజ్ చేయాలి. అలాగే పిల్లల బట్టలు తడిగా లేకుండా చూసుకోవాలి. మూత్ర విసర్జన అధికంగా ఉంటుంది కాబట్టి బట్టలు తడిచిన వెంటనే మార్చితే మంచిది. శరీరాన్ని గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. స్వెట్టర్, తల, చెవులను కప్పి ఉంచే క్యాప్ కూడా ధరించడం ముఖ్యం. అస్తమా వంటి వ్యాధులు ఉన్నవారు చలికి మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే సమయంలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు చల్లటి గాలులతో ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తాయి. అలాగే.. చలికాలంలో వృద్ధులకు రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. వారి పట్ల ఇంట్లో వారు పలు జాగ్రత్తలు పాటించాలి. ఎప్పుడు వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. బలమైన ఆహార పదార్థాలు పెట్టాలి. ఒకే దగ్గర ఉండకుండా నడక, వ్యాయామ ప్రక్రియలు చేయించాలి. చలి తీవ్రతతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. కావున జాగ్రత్తలు తప్పనిసరి.
– డాక్టర్ అనిల్‌కుమార్, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్, సంగారెడ్డి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: చలికాలంలో ఉదయం పొగమంచు పడుతుంటుంది. ఎదురుగా వచ్చే వాహనాలు సరిగ్గా కనిపించవు. దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. వీలైనంత వరకు పొగమంచు ఉన్నప్పడు వాహనం నడపకపోవడమే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. హెడ్‌లైట్ వేసుకుని వాహనం నడపాలి. బీమ్ డిప్పర్ లాంగ్ రేంజ్‌లో పెట్టుకోవాలి. వీలైనంత తక్కువ వేగంతో వెళ్లాలి. దీంతో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నా.. కొంత జాగ్రత్త పడవచ్చు. వీలైతే ఫ్లాష్ లైట్లు వేసుకోవాలి. వాహనాలకు రేడియం స్టిక్కర్లు ఉండేలా చూసుకోవాలి. ముందువైపు వైట్ కలర్, వెనుక వైపు రెడ్, సైడ్‌కు ఎల్లో స్టికర్లు ఉంచుకోవాలి. వాహనాన్ని నిలపాల్సి వస్తే తప్పనిసరిగా రోడ్డు కిందకి దించి ఆపుకోవాలి. లేదంటే ఇతర వాహనాలు వచ్చి ఢీకొట్టే ప్రమాదం ఉంటుంది. మెకానికల్‌కు సంబంధించి 15 సంవత్సరాలు పైబడిన వాహనాలకు సంబంధించి బ్రేక్‌లైట్లు పనిచేస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇంజన్ హీటర్ ప్లగ్ పనిచేస్తుందా చూసుకోవాలి. లేకపోతే వాహనం తొందరగా స్టార్ట్ కాదు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తులు ప్రశాంతంగా ఏకాగ్రత కోల్పోకుండా ఉండాలి. విశ్రాంతి లేకుండా ఎక్కువ గంటలు వాహనాన్ని నడిపితే ఇబ్బందులు వస్తాయి.
– ట్రాన్స్‌పోర్టు డిప్యూటీ కమిషనర్ వెంకటరమణ
Comments
Please login to add a commentAdd a comment