21న పెన్షనర్ల నూతన భవన ప్రారంభం
సంగారెడ్డి: పెన్షనర్ల నూతన భవనం ఈ నెల 21న శనివారం ప్రారంభించనున్నట్లు పెన్షనర్ల రాష్ట్ర సెక్రటరీ జనరల్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ.. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతాప్రభాకర్, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో పదివేల మంది పెన్షనర్స్ ఉండగా, సంగారెడ్డి ఎస్‌టీఓ పరిధిలో 4500 మంది పెన్షనర్లు ఉన్నారని అన్నారు. 2018లో మాజీ మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్ హన్మంతరావు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆశీర్వాదంతో సంఘ భవనానికి స్థలం కేటాయించారని గుర్తు చేశారు. 80 సంవత్సరాలు పైబడిన వారికి, కొత్తవారికి సన్మానం ఉంటుందన్నారు. కార్యక్రమంలో నర్సారెడ్డి, భక్కరెడ్డి, జగదీశ్వర్, మురళీధర్ పాల్గొన్నారు.
వేస్ట్ డీకంపోజర్‌తో
అధిక దిగుబడి
రైతులకు అవగాహన కల్పిస్తున్న ఏడీఏ
కంగ్టి(నారాయణఖేడ్): పంటల వ్యర్థాలు, ఆకు లు, చెత్తతో పంటలకు బలాన్ని చేకూర్చడంతో పాటు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించేందుకు వేస్ట్ డీకంపోజర్ విధానంతో సాధ్యమని ఏడీఏ నూతన్‌కుమార్ తెలిపారు. ఈ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో క్షేత్రస్థాయి యూనిట్లు నెలకొల్పి రైతులతో తయారు చేయిస్తున్నట్లు ఏఈఓ సంతోష్ కుమార్ చెప్పారు. కంగ్టి మండంలోని నాగుర్(కే)లో రైతులకు ఈ విధానంపై శిక్షణ ఇస్తున్నామని, రూ.20లతో 30గ్రాముల డీకంపోజర్ మదర్ కల్చర్‌తో వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు తేవచ్చని తెలిపారు. ఆవుపేడ నుంచి అభివృద్ధి చేసిన సూక్ష్మజీవుల పదార్థంతో నేలలో సారం పెంచడంతో పాటు జైవిక ఎరువుగాను, పంటలు రోగాల బారిన పడకుండా జైవికంగా నియంత్రిస్తుందన్నారు. ఆసక్తి గల రైతులు సంబంధిత ఏఈఓలను సంప్రదించాలని సూచించారు.
మౌలిక వసతుల
కల్పనకు కృషి
అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్
మునిపల్లి(అందోల్): విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం మునిపల్లి మోడల్ స్కూల్, హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థుల ఉన్నతికి ప్రభు త్వం అన్ని సౌకర్యాలు కల్పించడానికి సిద్ధంగా ఉందన్నారు. మోడల్ స్కూల్, హాస్టల్‌కు ఏమే మి కావాల్లో పూర్తి వివరాలు అందజేయాలని ప్రిన్సిపాల్ మల్లికను ఆదేశించారు. సీసీ కెమెరాలు, డిజిటల్ తరగతులు, కంప్యూటర్లు, డ్యూయల్ డేస్కులు, లైబ్రరీకి పుస్తకాలు, ఆటలు, స్పోర్ట్స్ మెటీరియల్, వాష్ రూమ్‌లకు మరమ్మతులు చేయాల్సి ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ హరినందన్‌రావు, ఎంపీఓ, ఎంఈఓ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment