అవకాశాలను సద్వినియోగం చేసుకోండి
సంగారెడ్డి జోన్: క్రీడాకారులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, లక్ష్యసాధన దిశగా ముందుకు వెళ్లి జిల్లా పేరును రాష్ట్రస్థాయిలో నిలపాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ పోటీలను ఆయన ప్రారంభించారు. స్విమ్మింగ్ పోటీలను టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు జావేద్ అలీ, డీవైఎస్‌ఓ కాసీంబేగ్, అథ్లెటిక్స్ పోటీలను మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్ ప్రారంభించారు.
భెల్‌ను సందర్శించిన
వెంకటేశన్
రామచంద్రాపురం(పటాన్‌చెరు): రామచంద్రాపురం బీహెచ్‌ఈఎల్ యూనిట్‌ను బుధవారం నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కరంచరీస్ చైర్మన్ ఎం.వెంకటేశన్ సందర్శించారు. ఈ సందర్భంగా బి.ఆర్.అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనకు భెల్ ఈడీ కె.బి.రాజా స్వాగతం పలికారు. సీఐఎస్‌ఎఫ్ కమాండెంట్ మంజీత్ కుమార్ ఆధ్వర్యంలో సీఐఎస్‌ఎఫ్ జవాన్‌లు గౌరవ వందనం చేశారు. అనంతరం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పరిశ్రమలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు అందిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జీఎంహెచ్‌ఆర్ శ్రీనివాస్‌రావు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment