నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్
సంగారెడ్డి జోన్: నేరాల నియంత్రణ కోసమే ప్రజలతో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని నారాయణరెడ్డి కాలనీలో ఎస్పీ చెన్నూరి ఆదేశాల మేరకు 100 పోలీసులతో కమ్యూనిటీ కాంటాక్ ప్రోగ్రామ్ (కార్డెన్ సెర్చ్) నిర్వహిచారు. కాలనీలో వివిధ పరిశ్రమల్లో పని చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధికి వచ్చే మైగ్రేట్ లేబర్ అధిక సంఖ్యలో నివాసం ఉంటారని ప్రతీ ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన గుర్తింపు కార్డు లేని వ్యక్తిని, సరైన పత్రాలు లేని 42 బైక్స్, 3 ఆటోలను అదుపులోకి తీసుకున్నారు. మీ చుట్టూ జరిగే నేరాల గురించి అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద, అపరిచిత వ్యక్తులపై నిఘా ఉంచాలని, అసాంఘీక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై జిల్లా పోలీసు శాఖకు నంబర్ 87126 56777 లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. కార్యక్రమంలో పట్టణ ఇన్‌స్పెక్టర్ రమేశ్, రూరల్ ఇన్‌స్పెక్టర్ క్రాంతి కుమార్, జోగిపేట సీఐ అనిల్, కొండాపూర్ సీఐ వెంకటేశం, సబ్ డివిజన్ ఎస్‌ఐలు, ట్రైనీ ఎస్‌ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డీఎస్పీ సత్తయ్య గౌడ్
Comments
Please login to add a commentAdd a comment