
కాలచక్రం
కాలినడక..
● నాడు నడుచుకుంటూ, సైకిల్, రిక్షాలపై బడికి.. ● నేడు ఆటోలు, బస్సులు, కార్లు, బైక్‌లపై.. ● యూనిఫామ్స్ లేకుండా స్కూల్‌కి.. ● బట్టతో కుట్టినవి, బియ్యం బస్తాలతో బ్యాగులు ● ప్రస్తుతం మార్కెట్‌లో వైరెటీగా.. ● పూర్తిగా మారిన విద్యార్థుల స్కూల్ దశ
మారుతున్న కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకూ పెరిగిపోతుంది. ఫలితంగా ఇటు విద్యలోనూ అటు విద్యార్థుల్లోనూ అనేక మార్పులు వచ్చాయి. గతంలో ఐదారు గ్రామాలకు కలిపి ఒకే పాఠశాల ఉండగా.. కిలో మీటర్ల మేర కాలినడకన వెళ్లేవారు. బస్సులు, ఆటోలు, బైక్‌లు ఉండేవి కాదు. సైకిల్ ఉంటే తల్లిదండ్రులు తమ పిల్లలను కూర్చోబెట్టుకొని పాఠశాలలో దింపేవారు. లేదా రిక్షాలో వెళ్లే వారు. కానీ, నేడు అంతా మారింది. కార్లు, ఆర్టీసీ బస్సులు, ఆటోలు, సొంత బైక్‌లపై వెళ్తున్నారు. విద్యార్థుల పాఠశాల దశలో అప్పటికీ, ఇప్పటికీ మారిన తీరుతెన్నులపై సాక్షి ప్రత్యేక కథనం.
– చెక్కపల్లి రాజమల్లు
దుబ్బాకరూరల్
యూనిఫామ్‌లు ఉండేవి కాదు: నాడు పాఠశాలకు వెళ్లాలంటే సివిల్ డ్రెస్సులోనే వెళ్లేవారు. అక్కడక్కడ చిరిగి పోయిన డ్రెస్సులు వేసుకునే వారు. విద్యార్థుల హెయిర్ స్టైల్ పొడవాటి జుట్టు ఉండేది. ఎలాంటి మార్పు ఉండేది కాదు. చెప్పులు వేసుకుని పాఠశాలకు వెళ్లేవారు. నేడు విద్యార్థుల్లో పూర్తిగా మార్పు వచ్చింది. రకరకాల డ్రెస్సులు, హెయిర్ స్టైల్స్ చేసుకుంటున్నారు. డ్రెస్ కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థులు పాఠశాలకు యూనిఫామ్, షూస్ ధరించి వెళ్తున్నారు.
బట్ట బ్యాగ్‌లు, గోనె సంచి బ్యాగ్‌లు : విద్యార్థులు తమ పుస్తకాలను బ్యాగ్‌లో పెట్టుకొని వెళ్లాలంటే బట్టతో కుట్టిన బ్యాగ్‌లు, గోనె సంచితో కుట్టిన బ్యాగ్‌లను వాడేవారు. నేడు రక రకాల బ్యాగులు మార్కెట్లోకి వచ్చాయి. జిప్పులు, బొమ్మలు ఉన్న బ్యాగులు కొంటున్నారు. పుస్తకాల బరువు తగ్గట్లు పెద్ద పెద్ద బ్యాగులు కొంటున్నారు.
వాహనాలపై పాఠశాలకు : నేడు విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి. పాఠశాలకు వెళ్లాలంటే బస్సులు, ఆటోలు, బైక్‌లు సౌకర్యంగా ఉన్నాయి. నర్సరీ దశ నుంచి విద్యార్థులు వాహనాలపై పాఠశాలకు వెళ్తున్నారు. ప్రస్తుతానికి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేవు.
ల్యాండ్ ఫోన్లు, పోస్టుకార్డులు : నాడు విద్యార్థులు పట్టణ ప్రాంతాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తే ల్యాండ్ ఫోన్ల ద్వారా కుటుంబీకులతో మాట్లాడేవారు. లేకుంటే పోస్టుకార్డు ద్వారా తమ ఇంటికి సమాచారం తెలిపే వారు. నేడు విద్యార్థులు సెల్ ఫోన్లలో మాట్లాడుతున్నారు.
మాజీ సీఎం కేసీఆర్ కాలినడకన బడికి : మాజీ సీఎం కేసీఆర్‌ది సిద్దిపేట జిల్లా, చింతమడక స్వగ్రామం. చింతమడక దుబ్బాకకు ఎనిమిది కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. అంత దూరం నుంచి సైకిల్‌పై పాఠశాలకు వచ్చేవారు. ఆయన తీపి గుర్తుగా దుబ్బాకలో పెద్ద పాఠశాల భవనాన్ని కట్టించారు. దానికి కేసీఆర్ స్కూల్‌గా నామకరణం చేశారు.
ఒక్క రూపాయికే సైకిల్ కిరాయి: ఆ రోజుల్లో ఇంటర్ విద్యార్థులకు బస్సు సౌకర్యం ఉండేది కాదు. గంటకు ఒక్క రూపాయి ఇచ్చి సైకిల్ కిరాయి తీసుకొని కాలేజీకి వెళ్లే వారు. నేడు విద్యార్థులు కాలేజీకి వెళ్లాలంటే బైక్‌లపైనా, కార్లలో వెళ్తున్నారు.
ఇంటి వద్ద ఆటలు : గతంలో విద్యార్థులు పాఠశాల నుంచి రాగానే ఇంటి వద్ద క్రికెట్, చిర్రగోనె, గోలిల ఆట, బొంగురం, ఆట, కబడ్డీ, వ్యవసాయ పొలాల వద్ద నీటి కుండిలో ఆటలు ఆడేవారు. నేడు సెల్‌ఫోన్లు రావడంతో ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నారు.
పిల్లలను సైకిల్‌పై బడికి
తీసుకెళ్తున్న తండ్రి
బస్సు ఎక్కుతున్న విద్యార్థులు
సైకిల్, రిక్షాలపై పాఠశాలకు :
నాడు విద్యార్థులకు బస్సులు, ఆటోలు, బైక్‌లు లేకపోవడంతో కాలి నడకనే పాఠశాలకు వెళ్లేవారు. గ్రామం నుంచి పాఠశాలకు ఐదారు కిలో మీటర్ల దూరంలో ఉండేది. కొంత మంది విద్యార్థులు కాలినడకన వెళ్లేవారు. సైకిల్ ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలో దింపేవారు. కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలను కిరాయి రిక్షాలో పంపేవారు. మరికొందరు ఆట్లో వెళ్లేవారు.

కాలచక్రం

కాలచక్రం

కాలచక్రం

కాలచక్రం

కాలచక్రం
Comments
Please login to add a commentAdd a comment