
క్రమం తప్పకుండా బడికి
మా కాలంలో గురువులను తల్లిదండ్రులను గౌరవించే వాళ్లం. వాళ్లకు ఎదురు తిరిగే వాళ్లం కాదు. బడికి క్రమం తప్పకుండా వెళ్లాం. గురువులంటే చాలా భయంగా ఉండేది. తరగతి గదిలో గురువు చెప్పిన పాఠాలు విని మరుసటి రోజున చెప్పే వాళ్లం. అప్పుడు చేతిలో చిల్లి గవ్వ ఉండేది కాదు. సెలవు రోజుల్లో కూలి పనికి వెళ్లే వాళ్లం.
– కట్కూరి రాంచంద్రం, పూర్వ విద్యార్థి
ల్యాండ్ ఫోన్‌లో మాట్లాడేది
నేను హైదరాబాద్‌లో వెటర్నరీ కోర్సు చేసేటప్పుడు మా తల్లిదండ్రులతో మాట్లాడాలంటే ఎక్కడైనా ల్యాండ్ ఫోన్ ఉంటే మాట్లాడే వాడిని. ఫోన్ అందుబాటులో లేకపోతే పోస్టుకార్డు ద్వారా మా తల్లిదండ్రులకు లేఖ రాసే వాడిని.
– భద్రయ్య, పూర్వ విద్యార్థి
సైకిల్‌పై బడికి వచ్చే వాడిని
మాది చెల్లాపూర్ గ్రామం నేను దుబ్బాకలో చదువుకునేటప్పుడు బడికి కాలినడకన మా స్నేహితులతో కలిసొచ్చే వాళ్లం. అప్పుడప్పుడూ మా నాన్న సైకిల్‌పై బడిలో దింపేవాడు. నేను ఇంటర్ చేసేటప్పుడు గంటకు ఒక్క రూపాయి కిరాయితో సైకిల్‌పై వచ్చే వాడిని.
– పరుశరాములు,
పూర్వ విద్యార్థి, చెల్లాపూర్ గ్రామం

క్రమం తప్పకుండా బడికి

క్రమం తప్పకుండా బడికి
Comments
Please login to add a commentAdd a comment