అనుమానాస్పద స్థితిలో వృద్ధుడు మృతి
చిలప్‌చెడ్(నర్సాపూర్): అనుమానాస్పద స్థితిలో వృద్ధుడు మృతి చెందిన ఘటన చిలప్‌చెడ్ మండలం చిట్కుల్ శివారులో గల చాముండేశ్వరి ఆలయ ఆవరణలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ నర్సింలు కథనం మేరకు.. హైదరాబాద్ గుడి మల్కాపూర్‌కు చెందిన పతంగే జగన్నాథరావు(60) 12న ఇంటి నుంచి స్కూటీపై వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు టప్పాచబూతర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం చిట్కుల్ శివారులో గుర్తు తెలియని శవం లభ్యం కావడంతో చిలప్‌చెడ్ పోలీసులు, టప్పాచబూతర్ స్టేషన్ సిబ్బందికి విష యం తెలుపగా కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి వచ్చి జగన్నాథరావుగా గుర్తించారు. మృతుడి కుమారుడు సంతోష్ మాట్లాడుతూ.. మూడు నెలల కిందట జగన్నాథరావు భార్య వరలక్ష్మి మృతి చెందగా అస్థికలు మంజీరా నదిలో కలిపామన్నారు. భార్య మృతితో మనస్తాపం చెంది, అదే స్థలానికి వచ్చి విషం తాగి పొలంలో పడి మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment