చిన్నశంకరంపేట(మెదక్): అదృశ్యమైన వ్యక్తి గ్రామంలోని ఓ పంట పొలంలో మృతదేహమై కనిపించాడు. ఈ ఘటన చిన్నశంకరంపేట మండలం చందాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పేట ఎస్‌ఐ నారాయణగౌడ్ కథనం మేరకు.. మండలంలోని చందాపూర్ గ్రామానికి చెందిన తుడుం రాజు(35) శుక్రవారం ఇంటి నుంచి బయటికి వెళ్లి రాత్రి అయినా తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో అనుమానంతో కుటుంబ సభ్యులు చిన్నశంకరంపేట పోలీస్‌స్టేషన్‌లో శనివారం సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ కెమెరాల్లో అంబాజీపేట వైపు నడుచుకుంటూ వెళ్లినట్లు గుర్తించారు. అటువైపు వెతుకుతుండగా పంటపొలంలో బోర్లా పడి మృతి చెందిన కనిపించాడు. భార్య మహేశ్వరి ఫిర్యాదు మేకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment