
బంజారాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం
పటాన్‌చెరు: నియోజకవర్గంలోని బంజారాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ బోధనలు నేటి తరానికి అనుసరణీయమని ఆయన తెలిపారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎంపీపీ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ...సొంత నిధులతో నియోజకవర్గ పరిధిలోని రాళ్ల కత్వ, ఐలాపూర్, వెలిమెల, కొల్లూరు తాండలలో సేవాలాల్ మహారాజ్ దేవాలయాలను నిర్మించామన్నారు. కార్యక్రమంలో అమీనపూర్ మాజీ జెడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, మండల విద్యాధికారులు పి.పి.రాథోడ్, నాగేశ్వర్ నాయక్, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేశ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment