
మూర్చవ్యాధి భరించలేక వ్యక్తి ఆత్మహత్య
ములుగు(గజ్వేల్): మూర్చవ్యాధి భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. ఈ ఘటన ములుగు మండలం బండమైలారంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. బండమైలారం గ్రామానికి చెందిన తుడుం శేఖర్ కొంతకాలంగా మార్చవ్యాధితో బాధపడుతుండేవాడు. దీంతో మధ్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో 12న రాత్రి స్థానిక రేషన్ దుకాణం వద్ద శేఖర్ వాంతులు చేసుకుంటుండగా గ్రామస్తులు గమనించి అతడి భార్య లతకు తెలిపారు. వెంటనే ఆమె అక్కడికి చేరుకొని ప్రశ్నించగా మూర్చవ్యాధి, ఆరోగ్య సమస్యలను తట్టుకోలేక పురుగుల మందును తాగినట్లు శేఖర్ చెప్పాడు. దీంతో అతడిని వెంటనే గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా అక్కడి వైద్యులు సూచించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శేఖర్ శనివారం రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment