
చికిత్స పొందుతూ గుర్తు తెలియని వృద్ధుడు మృతి
కొండపాక(గజ్వేల్): గుర్తుతెలియని వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుకునూరుపల్లి ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వెలికట్ట గ్రామ శివారులోని రైల్వే బ్రిడ్జి కింద ఆదివారం ఉదయం గుర్తు తెలియని వృద్ధుడు (65) అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు వృద్దుడిని 108 అంబులెన్సులో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీస్థితి విషమించడంతో గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని ఒంటిపై తెలుపు రంగు షర్టు, బూడిద రంగు ప్యాంట్ ధరించి తెల్లటి గడంతో ఉన్నాడన్నారు. మృత దేహాన్ని గాంధీ ఆస్పత్రిలో భద్రపరిచినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment