
ప్రమాదవశాత్తు డివైడర్‌ను...
కంగ్టి(నారాయణఖేడ్): ప్రమాదవశాత్తు డివైడర్‌కు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. కంగ్టి మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ప్రమాద ఘటన వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్రలోని దెగ్లూర్ తాలుకా భూతన్‌హిప్పర్గా గ్రామానికి చెందిన అశోక్‌పాటిల్(58) కంగ్టి మండలంలోని తుర్కవడ్‌గాం గ్రామంలో బంధువుల పెళ్లి నిశ్చితార్థం కోసం ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. తిరుగుప్రయాణంలో వేగంగా డివైడర్‌ను ఢీ కొట్టి రోడ్డుపై పడ్డాడు. దీంతో తలకు తీవ్రగాయమై రక్తస్రావం కావడంతోపాటు అక్కడికక్కడే స్థలంలోనే మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఖేడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment