
ఆపద్బాంధవులు!
● అత్యవసర సమయాల్లో రక్తదానం చేస్తున్న యువత ● ఐదు వందల మంది సభ్యులు.. రెండు వేల మందికి రక్తదానం ● ఆదర్శగా నిలుస్తున్న సంగారెడ్డి బ్లడ్ డోనర్స్ క్లబ్
సంగారెడ్డి రూరల్: మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తిని ఆదర్శంగా తీసుకుని రక్తదానం చేస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు ఆ యువకు లు. వాట్సాప్‌లో ఓ గ్రూపును ఏర్పాటు చేసుకుని ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సంగారెడ్డి బ్లడ్ డోనర్స్ క్లబ్ సభ్యు లు. సంగారెడ్డి పట్టణానికి చెందిన జనజాగృతి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు బంగారు కృష్ణ సంగారెడ్డి బ్లడ్ డోనర్స్ క్లబ్‌ను 2019లో ప్రారంభించారు.
పన్నెండు మందితో ప్రారంభించిన ఈ క్లబ్‌లో ప్రస్తుతం 500 మందికి పైగా బ్లడ్ డోనర్లు ఉన్నారు. ఎవరికైనా రక్తం అత్యవసరమైతే ఈ వాట్సాప్ గ్రూపులో పోస్టు చేస్తే చాలు అందుబాటులో ఉన్న వారు వచ్చి రక్తదానం చేస్తున్నారు. ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడుతున్నారు. ఇలా సుమారు ఆరు సంవత్సరాలుగా ఈ సేవ చేస్తున్నారు.
రక్తం ఎంతో విలువైనది.
ఒక యూనిట్ రక్తంతో ఒకరి ప్రాణాలు కాపాడచ్చు. ప్రమాదంలో గాయపడ్డ వారికి, గర్భిణులకు రక్తం ఎంతో అవసరం. క్లిష్ట పరిస్థితుల్లో ఆయా గ్రూప్ రక్తం అందుబాటులో లేకపోతే ప్రాణాలే పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో మేమున్నామంటూ బ్లడ్ డోనర్స్ క్లబ్ యువత ముందుకొచ్చి రక్తదానం చేస్తూ ప్రాణాలను నిలబెడుతోంది.
అపోహలు వద్దు..
ప్లాస్మాదానం కూడా..
కరోనా మహమ్మారి అనేక మంది ప్రాణాలను బలితీసుకుంటున్న రోజుల్లో కూడా డోనర్స్ క్లబ్ సభ్యులు రక్తదానం చేశారు. ఈ వైరస్ బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్లాస్మాదానం చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడారు.
కొందరు రక్తం ఇస్తే అనారోగ్యం పాలవుతా రని అనుమానాలు పెట్టు కుంటారు. ఇవన్నీ అపో హలు మాత్రమే. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి నాలుగు నెలలకు ఒకసారి బ్లడ్ డొనేట్ చేయవచ్చు. డొనేట్ చేసిన వెంటనే బ్లడ్ ఉత్పత్తి అవుతుంది. ఏలాంటి వ్యాధులు, అనారోగ్య సమస్యలు ఉండవు.
–డాక్టర్ అనిల్‌కుమార్,
ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్

ఆపద్బాంధవులు!

ఆపద్బాంధవులు!
Comments
Please login to add a commentAdd a comment