
రూ.1.72 లక్షల ఆస్తి పన్ను వసూలు
జిన్నారం (పటాన్‌చెరు): బొల్లారం మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వసూళ్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని కమిషనర్ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. పారిశ్రామికవాడలోని జెనెక్స్ లేబొ రేటరీ పారిశ్రామికవేత్తలు రూ.1.72లక్షలను చెక్కు రూపంలో మున్సిపల్ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ...జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు బృందాలను ఏర్పాటు చేసి స్పెషల్ డ్రైవ్ చేపట్టామన్నారు. ఆస్తి పన్ను చెల్లింపుల్లో నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే నోటీసులు అందించి ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించారు. ఏప్రిల్ నెల ఆరంభానికి ముందే ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆర్వో నర్సింలు, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు రఘురాం రెడ్డి, అలీ, సునీత, తదితరులు పాల్గొన్నారు.
పొగాకు ఆరోగ్యానికి
హానికరం: విష్ణువర్ధన్‌రెడ్డి
నారాయణఖేడ్: పొగాకు ఉత్పత్తుల వినియోగం ఆరోగ్యానికి హానికరమని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం సూపర్‌వైజర్ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఖేడ్‌లోని రాజీవ్‌చౌక్, బసవేశ్వర చౌక్, బస్టాండ్ ప్రాంతాల్లో ఆదివారం ప్రచారం నిర్వహించారు. పొగాకు ఉత్పత్తులైన బీడీ, చుట్ట, సిగరెట్, జరదా, తంబాకు, పాన్‌మసాలా లాంటివి వినియోగించకూడదని సూచించారు. వాటి వాడకం వల్ల హైపర్‌టెన్షన్, నోటి క్యాన్సర్, శ్వాసకోస, గుండె సంబంధిత వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడం సెక్షన్ 4 ప్రకారం నేరం అని అందుకు రూ.200 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
ఐఎంఏ నూతన
కార్యవర్గం ఎన్నిక
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నూతన కార్యవర్గం ఎన్నికై ంది. సంగారెడ్డిలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ కార్యవర్గ సభ్యుల సమక్షంలో ఎన్నికలను నిర్వహించారు. అధ్యక్షుడిగా కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఆనంద్, ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్, ఉష, సంయుక్త కార్యదర్శిలుగా సురేశ్ కుమార్, జ్యోతి, హరినాథ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్య వర్గం సభ్యులు మాట్లాడుతూ... సంగారెడ్డి కొత్త కార్యవర్గం సభ్యత్వం పెంపుదల చేస్తామన్నారు. ఉచిత వైద్య శిబిరాలు, నైతిక వైద్య ప్రవర్తన ప్రోత్సాహం, ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాలు, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంగారెడ్డి సీనియర్ వైద్యులు శ్రీహరి, విజయనిర్మల, శ్రీధర్,వెంకట్, స్వామిదాస్, రహీమ్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
తపస్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య
జహీరాబాద్: ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తపస్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య అన్నారు. జహీరాబాద్‌లోని అతిథి బ్యాంకెట్‌హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కరీంనగర్–మెదక్– నిజామాబాద్–ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్నారు. ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. సీపీఎస్‌రద్దు–పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకుగాను ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని హామీనిచ్చారు. సమావేశంలో తపస్ జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి, రాష్ట్ర కార్యదర్శి బస్వరాజ్, నర్సింహారెడ్డిలతోపాటు ఆయా మండలాల బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రూ.1.72 లక్షల ఆస్తి పన్ను వసూలు

రూ.1.72 లక్షల ఆస్తి పన్ను వసూలు
Comments
Please login to add a commentAdd a comment