పూర్తిస్థాయిలో రైతు భరోసా
ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి డిమాండ్
నారాయణఖేడ్: రైతు భరోసాను పూర్తిస్థాయిలో రైతులందరికీ అందించాలని ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటివరకు 3 ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో నగదు జమచేశామని ప్రభుత్వం చెబుతున్నా 60 శాతం మందికి కూడా అందలేదన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...నాగల్‌గిద్ద మండలంలో 13 వేల ఎకరాలకుగాను 8 వేల ఎకరాలకు మాత్రమే నగదు జమ చేశారన్నారు. శేరిదామరిగిద్దలో గిరిజనులకు సంబంధించి 525 ఎకరాలున్నా ఒక ఎకరానికి కూడా డబ్బులు అందలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేసేవాడినని, కానీ, ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే ఉన్నా రైతులను ఏమాత్రం పట్టించుకోవడంలేదని విమర్శించారు. రైతుల ఖాతాల్లో రైతుభరోసా డబ్బులను జమచేయాలని, లేనిపక్షంలో భారీ ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
నేడు రక్తదాన శిబిరం
మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఖేడ్ ప్రాంతీయ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఖేడ్ బీఆర్‌ఎస్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. బీఆర్‌ఎస్, అనుబంధ సంఘాల బాధ్యులు, నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment