ఇంటర్‌ విద్యార్థులకు మరోసారి అవకాశం | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థులకు మరోసారి అవకాశం

Published Mon, Feb 17 2025 7:20 AM | Last Updated on Mon, Feb 17 2025 7:19 AM

ఇంటర్‌ విద్యార్థులకు మరోసారి అవకాశం

ఇంటర్‌ విద్యార్థులకు మరోసారి అవకాశం

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: ఇటీవలే ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు గైర్హాజరైన జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులకు విద్యాశాఖ మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు ఇంటర్మీడియెట్‌ జిల్లా అధికారి గోవిందరాం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాక్టికల్‌ పరీక్షలు ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు జరుగనున్నాయని తెలిపారు. ఈ పరీక్షలు సంగారెడ్డిలోని బాలుర జూనియర్‌ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. గైర్హాజరైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement