
541 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
జహీరాబాద్: అక్రమంగా పక్క రాష్ట్రాలకు రెండు లారీల్లో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు చిరాగ్‌పల్లి ఎస్‌ఐ రాజేందర్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. మొగుడంపల్లి మండలంలోని మాడ్గి గ్రామ శివారులోని రాష్ట్ర సరిహద్దులో గల రవాణా చెక్ పోస్టు వద్ద సోమవారం సివిల్ సప్లయ్ శాఖ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. రెండు లారీల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గుర్తించారు. హైదరాబాద్ నుంచి కర్ణాటకకు లారీలో 266 క్వింటాళ్లు, హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు లారీలో 275 క్వింటాళ్ల బియ్యం తరలిస్తుండగా పట్టుకున్నాం. ఈ సందర్భంగా ఆయా లారీల యజమానులు మన్సూర్, జాకీర్, లారీ డ్రైవర్లు ఎం.డీ పాష, భీమయ్యలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment