
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన జేసీబీ
ఐదుగురికి స్వల్ప గాయాలు
సిద్దిపేటఅర్బన్: ఆర్టీసీ బస్సును జేసీబీ ఢీకొట్టిన ఘటన సిద్దిపేటలోని రంగధాంపల్లి వద్ద సోమవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. సిద్దిపేట నుంచి హన్మకొండకు ఆర్టీసీ బస్సు వెళ్తుంది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న జేసీబీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ఐదుగురు ప్రయాణిలకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జేసీబీ డ్రైవర్ రవిశంకర్ కుమార్ అజాగ్రత్తగా నడిపి బస్సును ఢీకొట్టాడని డ్రైవర్ ప్రభాకర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment