శుభకార్యానికి వచ్చి.. కారు ప్రమాదంలో బాలుడు మృతి
మిరుదొడ్డి(దుబ్బాక): బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చి సరదాగా వాగు పరిసరాలను, వ్యవసాయ పొలాలను తిలకిద్దామని వెళ్లిన బాలుడు కారు బోల్తా పడటంతో మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నలుగురిలోని 17 ఏళ్ల మైనర్ బాలుడు అతివేగంగా కారు నడపడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాలలో సోమవారం చోటు చేసుకుంది. మిరుదొడ్డి పోలీసుల కథనం మేరకు.. హైదరాబాద్‌లోని మల్లాపూర్‌కు చెందిన లేగల నరేందర్, సుజాత దంపతులు వారి పిల్లలు జయ రక్షిత్ (14), జశ్వంత్‌తో కలిసి అల్వాలలోని తమ బంధువులైన బొమ్మ జ్యోతి గృహ ప్రవేశం కార్యక్రమానికి వచ్చారు. అలాగే కరీంనగర్ పట్టణానికి చెందిన ఏదుల రవిశంకర్, స్వప్న దంపతులు వారి పిల్లలు యశ్వంత్, అమ్ములుతో హాజరయ్యారు. సోమవారం సరదాగా అల్వాల శివారులోని కోదండరాముడి ఆలయం, కూడవెల్లి వాగు పరిసరాలు, వ్యవసాయ పొలాలను తిలకించడానికి జయ రక్షిత్, జశ్వంత్, యశ్వంత్, అమ్ములు కలిసి కారులో బయలు దేరారు. ఇందులోని 17 ఏళ్ల మైనర్ బాలుడు జశ్వంత్ కారు నడుపుతున్నాడు. ఎరుకలి వాడ సమీపంలోకి రాగానే మలుపు వద్ద కారు అతివేగంగా వస్తూ అదుపుతప్పి బోల్తా పడింది. రెండు పల్టీలు కొట్టడంతో కారులోని జయ రక్షిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికుల సహాయంతో 108 ద్వారా సిద్దిపేట జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జశ్వంత్, యశ్వంత్‌ల పరిస్థితి విషమంగా మారడంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుడు మల్లం రవి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మరో ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలు
అతివేగంగా వచ్చి బోల్తాపడ్డ కారు
వాహనాన్ని నడిపిన
17 ఏళ్ల బాలుడు
మిరుదొడ్డి మండలం
అల్వాలలో ఘటన
శుభకార్యానికి వచ్చి.. కారు ప్రమాదంలో బాలుడు మృతి
Comments
Please login to add a commentAdd a comment