తునికి ఆలయం వేలం పాట వాయిదా
కౌడిపల్లి(నర్సాపూర్): పాత బకాయిలు వసూలు చేసే వరకు వేలం పాటను ఆపాలని తునికి గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో వేలం పాట వాయిదా పడింది. ఈ ఘటన మండలంలోని తునికి నల్ల పోచమ్మదేవి ఆలయం వద్ద సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తునికి నల్లపోచమ్మ దేవి ఆలయం జాతర వచ్చే నెలలో జరుగనుంది. అధికారులు కొబ్బరికాయలు, దుకాణాలు, టెంట్ సామగ్రి అద్దెతోపాటు వాహనాల పార్కింగ్‌కు వేలంపాటను ఆలయ ఇన్‌చార్జి ఈఓ రంగారావు, పరిశీలకులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. దీంతో మాజీ కో ఆప్షన్ సభ్యుడు రహీం, మాజీ ఆలయ కమిటీ చైర్మన్లు చెల్ల మల్లేశం, శ్రీనివాస్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సాయిలు, మాజీ ఉపసర్పంచ్‌లు మాణిక్య రెడ్డి, శేఖర్, గ్రామస్తులు వేలం పాటను అడ్డుకున్నారు. గతేడాది వేలం పాట ద్వారా ఆలయానికి రూ.44 లక్షలు ఆదాయం రాగా, ఇందులో రూ.4.90 లక్షలు బకాయి ఉన్నట్లు తెలిపారు. అలాగే నాలుగేళ్లకు సంబంధించి రూ.30 లక్షల వరకు పలువురు బకాయి పడినట్లు అధికారులు తెలిపారు. బకాయిలు చెల్లించని వారికి నోటీసులు జారీ చేసి కేసులు వేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. స్పందించిన ఇన్‌చార్జి ఈఓ రంగారావు బకాయిదారులకు నోటీసులు ఇస్తామని, స్పందించకపోతే పోలీస్‌లకు ఫిర్యాదు చేస్తామని వేలం పాటను వాయిదా వేశారు. 24న తిరిగి వేలం పాటను నిర్వహిస్తామని ఈఓ తెలిపారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ వెంకట్‌రెడ్డి గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
పాత బకాయిలు వసూలు చేయాలని
గ్రామస్తుల డిమాండ్
నోటీసులు ఇస్తామన్న ఈఓ
Comments
Please login to add a commentAdd a comment