తాగడానికి డబ్బులు ఇవ్వలేదని..
తూప్రాన్: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని కోపోద్రికుడైన భర్త భార్యను కొట్టి చంపాడు. ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ రంగాకృష్ణ కథనం మేరకు.. మధ్యప్రదేశ్‌కు చెందిన భార్యాభర్తలు ఆదివాసి అశోక్, భార్య శివకాలి బతుకుదెరువు కోసం మూడు నెలల కిందట మెదక్ జిల్లా తూప్రాన్‌కు వచ్చి పోతరాజుపల్లిలో నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన అశోక్ నిత్యం డబ్బుల కోసం భార్యని వేధించేవాడు. ఆదివారం రాత్రి డబ్బుల కోసం భార్యతో గొడవకు దిగాడు. ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో కోపోద్రికుడై కట్టెతో విచక్షణారహితంగా భార్యను కొట్టడంతో తీవ్ర గాయాలై మృతి చెందింది. ఉదయం చుట్టుపక్కల వారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ శివానందంతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి అశోక్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశామని తెలిపారు.
భార్యను కొట్టి చంపిన భర్త
తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో ఘటన
Comments
Please login to add a commentAdd a comment