ఇద్దరు అదృశ్యం
పరిశ్రమలో పని చేస్తున్న యువకుడు
మనోహరాబాద్(తూప్రాన్): పరిశ్రమలో పని చేస్తున్న యువకుడు అదృశ్యమైనట్లు ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాకు చెందిన తానాజీ పాలిమార్ స్టీల్ పరిశ్రమలో వెల్డర్‌గా పని చేస్తున్నాడు. 9న బయటకు వెళ్లిన ఇంటికి రాలేదు. తానౌజీ అన్న గోపాల్‌కు ఇంటి యజమానులు సమాచారం అందించగా చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. గోపాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మతి స్థిమితం లేని వృద్ధురాలు
సిద్దిపేటకమాన్: మతి స్థిమితం సరిగా లేని వృద్ధురాలు అదృశ్యమైన ఘటనపై సిద్దిపే ట పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ ఉపేందర్ కథనం మేరకు.. సిద్దిపేట ఆదర్శనగర్‌కు చెందిన శీలం లక్ష్మీ (90) స్థానికంగా కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. లక్ష్మీ తరచూ కాలనీలో తిరుగుతూ రాత్రికి ఇంటికి చేరుకునేది. శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. లక్ష్మీ మనవరాలు జ్యోతి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఇద్దరు అదృశ్యం
Comments
Please login to add a commentAdd a comment