
బైక్‌ను ఢీకొట్టిన బొలేరో వాహనం
కల్హేర్(నారాయణఖేడ్): కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిర్గాపూర్ మండలం అంతర్‌గామ్‌కు చెందిన మహిళ మృతి చెందింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. అంతర్‌గామ్‌కు చెందిన సంగయ్య, శకుంతల(55) దంపతులు బైక్‌పై మంగళవారం కామారెడ్డి జిల్లా పిట్లం మండలం పెద్దకోడప్‌గల్ గ్రామంలోని బంధువుల ఇంటికి బయల్దేరారు. చిన్నకోడప్‌గల్ వద్ద సంగారెడ్డి–నాందేడ్ 161 నేషనల్ హైవేపై వెనుక నుంచి బొలేరో వాహనం వీరి బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా అంబులెన్స్‌లో స్థానికులు పిట్లం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో శకుంతల మృతి చెందింది. సంగయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పిట్లం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో సిర్గాపూర్ మండలానికి చెందిన మహిళ మృతి
Comments
Please login to add a commentAdd a comment