
పోషకాల లోపం.. ఎదుగుదలపై ప్రభావం
ఆరబెడుతూ నీటి తడులు అందించాలి
వ్యవసాయ అధికారులు
దుబ్బాకటౌన్: సాగు భూమిలో పోషకాల లోపంతోనే వరి నాటు వేసిన తర్వాత ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుందని రాయపోల్ మండల వ్యవసాయ అధికారి నరేశ్ తెలిపారు. మంగళవారం రాయపోల్ మండల పరిధిలోని రాంసాగార్ గ్రామంలో వరి పొలాలను, రైతుల పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు సాగు చేసే వరి పంటలో చౌడు భూమిలో వరి ఎర్రబారి వేసిన కర్ర వేసినట్లు ఉండి పొలం అంతా బుడబుడగా ఉండి వరి వేర్లు నల్లగా మారి భూమి లోపలి పోషకాలు తీసుకోకపోవడంతో జింక్, ఇతర పోషకాల లోపాలు కనిపిస్తున్నాయన్నారు. నివారణకు 19.19.19 ఒక కేజీ ఎకరానికి + జింక్ సల్ఫేట్ 400–500 గ్రాములు ఎకరానికి రెండు సార్లు పిచికారీ చేసి, పొలం బాగా నెర్రలు వచ్చే లాగా ఆరబెట్టాలన్నారు. ప్రస్తుతం యాసంగి కాలంలో జింక్ లోపాలు ఎక్కువ కనిపించే అవకాశం ఉందని, జింక్ నివారణ కోసం జింక్ సల్ఫేట్ 2.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రవీణ్, స్వర్ణలత, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
వరి పంటను పరిశీలించిన
వ్యవసాయాధికారులు
దుబ్బాక: ఎవరికీ రాకూడ ని కష్టం.. ఎర్రబడి చచ్చిపోతున్న వరి చేలు పేరిట సాక్షిలో ప్రచురితమైన కథనానికి వ్యవసాయాధికారులు స్పందించారు. మంగళవారం వ్యవసాయాధికారులు జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించి వరి పంటలను పరిశీలించారు. దుబ్బాక మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్, ఏఈఓ మనోజ్ఞ పట్టణంలోని కేసుగారి స్వామి, గుండెల్లి శ్రీనివాస్‌రెడ్డితోపాటు పలువురు రైతుల పంటలను పరిశీలించారు. నాట్లేసి 45 రోజులు గడుస్తున్నా వరిపంటలు ఎదుగుదల లేకుండా కుళ్లిపోయి, ఎర్రబడి చచ్చిపోతుండడాన్ని గమనించారు. మొగిపురుగు, వాతావరణ పరిస్థితులు, భూములు తడి ఆరకుండా ఉండడంతోపాటు జింక్ తదితర సమస్యలతో పంటలకు నష్టం జరుగుతుందని గమనించారు. మొగి పురుగు ఎక్కువగా ఆశించిన పంటలకు కార్టాప్ 4 జీ గుళికలు లేదా క్లోరంత్రానిలిప్రోలే లేదా బరోజ్ వంటి మందులు వేసుకోవాలన్నారు. వరి పంటలను ఆరబెడుతూ నీటి తడులు అందించాలి. పలు సస్యరక్షణ చర్యలను రైతులకు సూచించారు.

పోషకాల లోపం.. ఎదుగుదలపై ప్రభావం

పోషకాల లోపం.. ఎదుగుదలపై ప్రభావం
Comments
Please login to add a commentAdd a comment