పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
నర్సాపూర్: పోలింగ్ కేంద్రం వద్ద నిబంధనల మేరకు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఎస్‌ఐ లింగంకు సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఎస్పీ మంగళవారం పరిశీలించారు. పట్టణంలోని ప్రభుత్వం జూనియర్ కాలేజీలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాలను, ఓటరు జాబితాను పరిశీలించారు. ఎస్‌ఐ, మండల ఆర్‌ఐ ఫైజల్ పోలింగ్ స్టేషన్ల వివరాలను ఎస్పీకి వివరించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. స్టేషన్‌లో పలు రికార్డులు పరిశీలించి కేసులను త్వరగా ఛేదించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని ఎస్‌ఐకి సూచించారు.
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ
శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రమైన శివ్వంపేట ఉన్నత పాఠశాలలోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట సీఐ రంగక్రిష్ణ, ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి ఉన్నారు.
ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment